ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం మార్చి 11వ తేదీన విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను
ప్రభాస్ దగ్గరుండి చూసుకున్నాడు. ఇతర భాషలలో సైతం ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడం విశేషం. తాజాగా ఈ
సినిమా యొక్క ప్రచార కార్యక్రమంలో
ప్రభాస్ పాల్గొన్నాడు. ఆ విధంగా రాధే
శ్యామ్ చిత్రాన్ని విజయవంతం చేయడానికి
ప్రభాస్ నడుం బిగించడం ప్రేక్షకుల దగ్గరికి వెళ్లడం జరుగుతుంది. మరి ఈ
సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
మొదటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అంతే కాదు ఈ
సినిమా ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఆ విధమైన సినిమాగా చూడవద్దని దీనిని ఒక
ప్రేమ కథ సినిమాగా మాత్రమే చూడాలని భారీ అంచనాలు పెట్టుకొని సినిమాకి వస్తే తప్పకుండా నిరాశ పడతారు అని చెప్పడం ప్రేక్షకులను ఎంతో నిరాశపరిచింది అని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ
సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులలో నిరాశ వచ్చేలా చేశారు.
అయితే ఇదే ఈ సినిమాపై భారీగా హైప్ రావడానికి కారణం అని తెలుస్తుంది.
ప్రభాస్ సినిమా అనగానే ఎక్కడ చూసినా ఆ హవానే కనిపిస్తుంది.
ప్రభాస్ అభిమానులు ఆ స్థాయిలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను సోషల్ మీడియాలో చేపడతారు. అయితే అలా కాకుండా మేకర్స్ ఈ విధమైన ప్రచారం చేయడం వలన ఈ
సినిమా భారీ స్థాయిలో ఉండబోదు అని ప్రచారం జరగడంతో ఈ
సినిమా జోరు కొంత తగ్గింది అంటున్నారు. మరి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఈ
సినిమా కు ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనేది చూడాలి. ఏదేమైనా
ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ
సినిమా పై గట్టిగానే పెట్టుకున్నారని సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా ని బట్టి తెలుస్తుంది.