పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రాల్లో 'రాధేశ్యామ్' సినిమా కూడా ఒకటి.. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది ఇప్పటికే వాయిదా పడిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది .ఇకపోతే ఈ సినిమా తరువాత ప్రభాస్ తదుపరిగా  'ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె' చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా వీటిలో 'ఆదిపురుష్' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

అయితే మరికొద్ది రోజుల్లో సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతోంది.ఇక  ఆపై మారుతి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కాబోతోంది. అయితే ఇన్ని సినిమాలతో ఇంత బిజీగా ఉన్న ప్రభాస్ కు ఏ రేంజ్ లో అభిమాన గణం ఉందో తెలిసిందే. కాగా  ప్రభాస్ సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటారు. అయితే తను నటించే ప్రతీ సినిమాకి సంబంధించిన విశేషాల్ని అభిమానులతో షేర్ చేసుకోవడం ఆయనకి పరిపాటి.కాగా  అందుకే ఆయన ఇన్ స్టా అకౌంట్ లోని ఫాలోవర్స్ ఓ రేంజ్ లో పెరిగి సరికొత్త రికార్డ్ ను సెట్ చేసిపెట్టారు. ఇక ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 8 మిలియన్స్ కు చేరుకుంది.

అయితే అతి తక్కువ సమయంలో ఆయన ఈ ఫీట్ ను సాధించడం విశేషం. కాగా 'బాహుబలి' చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం 'రాధేశ్యామ్' చిత్రం విడుదలకు రెడీ అవడంతో.. ఆయన ఇన్ స్టా ఖాతాలోకి మరింతగా ఫాలోవర్స్ వచ్చి చేరారు.అయితే  ఇంత తక్కువ టైమ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఇక  ముందు ముందు ప్రభాస్ ఖాతాలో ఇంకెంతగా ఫాలోవర్స్ చేరతారో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: