దక్షిణాదిన భారీ చిత్రాల దర్శకుడిగా భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు శంకర్. ఆయన సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూసే వారు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు. ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలు భారీ విజయాన్ని సంపాదించు కోవచ్చు అనే ఆలోచన వారిలో ఉండేది. ఆయన సినిమాలు ఎంత భారీగా ఉంటాయో అంతే భారీస్థాయిలో వసూళ్లు కూడా సదరు సినిమాకు వచ్చేవి ఆ విధంగా దర్శకుడిగా ఆకాశానికి ఎదిగారు శంకర్.

అయితే ఇప్పుడు అయితే ఆయనకు అపజయాలు ఎదురయ్యాయో అప్పటి నుంచి ఆయన కెరీర్ సాగలేదు అనే చెప్పాలి. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన ఐ సినిమా భారీ స్థాయిలో ఫ్లాప్ తెచ్చిపెట్టింది. అప్పుడే శంకర్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా ఆయనకు పెద్దగా కలసి రాలేదు. భారీ బడ్జెట్ సినిమాలు కావడం తో భారీగానే నష్టాలు కూడా వచ్చాయి. ఆ విధంగా ఆయన చేసిన భారతీయుడు సినిమా ఆర్థిక కారణాలతో ఆగిపోయింది. ఇంత పెద్ద సినిమా ఆగిపోవడం ఆయనకు అవమానమే అని చెప్పవచ్చు.

కమల్ హాసన్ కూడా ఈ చిత్రం విషయంలో ఎన్ని మంతనాలు చేసినప్పటికీ నిర్మాతలకు దర్శకులకు ఏ మాత్రం పొత్తు కుదరక పోవడంతో ఈ సినిమా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి తెలుగులో సినిమా చేస్తున్నాడు శంకర్. ఈ చిత్రం తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆయన భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శంకర్ ఈ చిత్రానికి తన గత సినిమాల తరహాలో కాకుండా కొత్త రకంగా ముందుకు వెళుతూ ఉండడం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో శంకర్ తన పాత పంథా ను వదిలి ఇప్పుడు కొత్త తరహాలో సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఆయనకు మళ్లీ పూర్వవైభవం తీసుకు వస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: