ప్రస్తుతం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఏదంటే rrr అని చెప్పవచ్చు. ఇందులో మెగా స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే.. ఈ సినిమా ప్రస్తుతం హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం గా నిలిచింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచుకున్నారు అభిమానులు సినీ ప్రేక్షకులు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు ఈ సినిమాని విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఈనెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైనది.

సినిమా విడుదల విషయంలో కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు చిత్రబృందం. ఈ సినిమా కోసం దేశంలోని నలుమూలల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక విడుదల తేదీ చాలా దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా ప్రమోషన్ లో కూడా అంతే వేగవంతంగా చేశారు చిత్ర బృందం. ఇక దాదాపుగా ఇచ్చి సినిమాకి ప్రమోషన్ కోసమే 35 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా సమాచారం. అయితే ఈ సారి కూడా రాజమౌళిసినిమా ప్రమోషన్ లో చాలా వేగవంతంగా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మరొకసారి వినిపిస్తున్న మాట ఏమిటంటే ఈ సినిమాలోని ఒక పాటను విడుదల చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.



నిజానికి ఈ స్పెషల్ సర్ ప్రైజ్ ను సినిమా చివర్లో ఇవ్వాలనుకున్నారు చిత్రబృందం. కానీ ఎగ్జిట్ మెంట్ ఆపుకోలేక ఇప్పుడు విడుదల చేస్తున్నారని సమాచారం. ఇక వీటికి సంబంధించి రాజమౌళి గతంలో కూడా ఒకసారి పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అది ఈ నెల 14వ తేదిన విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక నెత్తురు మరిగితే అనే పాటను విజువల్స్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పాట 20 సెకండ్ల వరకు ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: