మెగా బ్రదర్ కుమారుడైన వరుణ్ తేజ్ మరియు దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కంచె. ఈ చిత్రం ఎంతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ క్రిష్ కూడా ప్రశంసల వర్షాన్ని దక్కించుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే ఒక పెద్ద సినిమాని తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇందులో హీరోయిన్ గా నటించినది ప్రగ్యా జైస్వాల్. ఈమె అమాయకపు మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా చేసింది.


నటనపై ఆమె పాత్రకు జీవం పోసినట్లుగా నటించింది ఈ ముద్దుగుమ్మ.. ఇక ఈ చిత్రంతో ఈమెకు టాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు లభిస్తుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు.. కానీ అందంగా ఉన్నా మంచి నటన కనబరిచినప్పటికి కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేకపోయింది. కంచె సినిమా విడుదలై ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మకు ఇంకా అవకాశాలు తక్కువగానే వెలువడుతున్నాయి. అలా అడపదడప వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ  మెల్లమెల్లగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోంది. ఇక రీసెంట్ గా బాలకృష్ణతో అఖండ చిత్రంలో జోడీ గా నటించి ప్రేక్షకులను మరొకసారి కట్టి పడేలా చేసింది. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది.

ఇక దీంతో ఈ సారి ఈ ముద్దుగుమ్మ బిజీ అవుతుందని అందరూ భావించారు.. కానీ ఈ చిత్రం విడుదలై ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్నా కూడా ఆమెకు తదుపరి సినిమాలలో అవకాశాలు రాలేదు. ఇక ఇంత అందం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆఫర్ రాలేదంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక అందాల ఆరబోత విషయంలో కూడా ఈ ముద్దుగుమ్మ తరుచూ అప్పుడప్పుడు కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు  ఇంకా అదృష్టం కలిసిరాలేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: