మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ఆయన మొట్టమొదటి సారి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు రామ్ చరణ్ కూడా హీరోగా నటిస్తూ ఉండడం ఈ సినిమా భారీ స్థాయిలో తెరకు ఎక్కడానికి ముఖ్య కారణం. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు చేసుకున్న లైనప్ చూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. రాజమౌళి సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. ఎవరికి అంత ఈజీ గా సెట్ కానీ కాంబో లో ఆయన సినిమా చేస్తూ ఉండడం విశేషం. ఆ తర్వాత కూడా రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. జెర్సీ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ దర్శకుడు వెంటనే అతి పెద్ద స్టార్ హీరో తో సినిమా చేయడం విశేషం.
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాడు చరణ్. ఆ మధ్య ఆ దర్శకుడిని కలిసి సినిమా కథ కూడా ఓకే చేసుకున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. తాజాగా మరో తమిళ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా ఓకే చేసే విధంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే నటుడు సముద్రఖని చెప్పిన కథకు ఫిదా అయిన రామ్ చరణ్ ఆయన దర్శకత్వంలో సినిమా కి ఒకే చెప్పాడట. దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న సముద్రఖని తెలుగులో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత దర్శకత్వం చేయబోతున్న ఆయన ఈ సినిమాతో ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి