ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు మూలస్తంభంగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిత్రపరిశ్రమ బాధ్యతలను భుజాన వేసుకుని అందరి సమస్యలను తీర్చడంలో ముందుంటున్నారు. అయితే ఇక కొన్ని దశాబ్దాల నుంచి చిరంజీవి స్టార్ హీరో గానే కొనసాగుతున్నారు ఉన్న విషయం తెలిసిందే. 60 ఏళ్ల వయసు దాటిపోతున్నా ఇంకా యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇక వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. యువ హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దం అవుతుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తనయుడు రామ్చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే కన్నడ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ లో కూడా నటిస్తున్నారు చిరంజీవి. సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా గాడ్ఫాదర్ సినిమా తెరకెక్కుతుంది. ఇక పొలిటికల్ కింగ్ మేకర్ గా ఒక పవర్ ఫుల్ పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు చిరంజీవి. ఇక చిరంజీవి సోదరి పాత్రలో నయనతార తమ్ముడిగా సత్యదేవ్ నటిస్తున్నారు.



 ఇక కుడి భుజం లాంటి ఒక పవర్ ఫుల్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తూ ఉండడం గమనార్హం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఒక సీక్రెట్ రివిల్ అయింది. గాడ్ ఫాదర్ సినిమాలో ప్రజా గాయకుడు గా పేరు తెచ్చుకున్న గద్దర్ కూడా నటిస్తున్నారు అన్న విషయం తెలుస్తోంది.  ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గద్దర్ స్వయంగా చెప్పుకొచ్చారు. జైల్లో ఒక సన్నివేశం ఉంటుందని.. చిరంజీవి జైలుకు వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి ఆయనకు పరిచయమవుతారు. ఇక ఆయన చిరంజీవి తండ్రి స్నేహితుడిగా చెప్పుకుంటాడు. ఇక ఆ పాత్రలో కనిపించబోతున్నాడట గద్దర్. అంతేకాదు ఇక ఈ సినిమాలో ఒక పాటను కూడా పడబోతున్నాడట ప్రజా గాయకుడు గద్దర్.

మరింత సమాచారం తెలుసుకోండి: