నాని గత కొంత కాలంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యారు. దాంతో ఇప్పటి నుంచి చేసే చిత్రాలు రెగ్యులర్ గా కాకుండా కొంత వెరైటీగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన సినిమాలను చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో రెగ్యులర్ పాత్రల కంటే వెరైటీ పాత్రలకే ఎక్కువగా డిమాండ్ ఉంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పుష్ప రాజ్ పాత్ర కు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి పాత్రలను చేయడానికి హీరోలందరూ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో నాని తన కొత్త చిత్రం దసరా సినిమాలో ఈ అవతారంలో కనిపించి ఒక్కసారిగా తన అభిమానులను ఎంతగానో సంతోష పరిచారు.
కోల్ మైన్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో హిట్ కొట్టి భారీ స్థాయిలో ఆకట్టుకోవాలని నాని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఊర మాస్ అంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను ఈ ఏడాదే విడుదల చేయడం విశేషం. తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. ఇటీవలే లాంఛనం గా ప్రారంభించగా ఈరోజు స్పార్క్ ఆఫ్ దసరా అనే పేరుతో విడుదల చేసింది చిత్రబృందం.
ఇందులో ఆయన పాత్ర చాలా వెరైటీ గా ఉండడంతో పాటు ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది అంటున్నారు. తప్పకుండా నానికి ఈ సినిమా విజయాన్ని తెచ్చి పెడుతుంది అంటున్నారు. మరి నాని ఈ సినిమాను ఒప్పుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా కంటే ముందు అంటే సుందరానికి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దం అవుతుంది. మరి దీని విడుదల ఎప్పుడూ ఉంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి