పెళ్లి సందడి
సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న
హీరోయిన్ శ్రీలీల. ఇప్పుడు వరుస చిత్రాలు ఒప్పుకుంటూ అగ్ర
హీరోయిన్ అయ్యేందుకు ఎంతో వేగంగా దూసుకుపోతోంది. ఆమె తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించడం తో తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఈమెకు ఉన్న డిమాండ్ దృష్ట్యా మేకర్స్ తమ సినిమాలో ఆమెను పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఆమెను భరించడం చాలా కష్టమని ఇంకొకవైపు చెబుతున్నారు.
అగ్ర
హీరోయిన్ తరహాలోనే ఈమె కోటికి పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని కొందరు అంటున్నారు.
సినిమా పరిశ్రమలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను చాలామంది పాటిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ
హీరోయిన్ తనకు మంచి డిమాండ్ ప్రేక్షకుల్లో పాపులారిటీ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకాల తీసుకోవాలని చెప్పి ఈ విధమైన ఆలోచన చేస్తుంది. ఈమె ఆలోచించడం లో ఎటువంటి తప్పులేదు కానీ నిర్మాతలు ఈమె ఇంత త్వరగా తన పారితోషికాన్ని పెంచడం మంచి ది కాదని చెబుతు న్నారు.
పెళ్లి సందడి
సినిమా విడుదల కాకముందే
రవితేజ సినిమాలో
హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఆ విధంగా ఆ సినిమాలో ఈమె నటిస్తూ ప్రేక్షకులను అలరించే విధమైన పాత్ర చేయబోతుంది అని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే చివరిదశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈమె ఈ
సినిమా తో ప్రేక్షకులను మరింతగా అలరిస్తుందని చెప్పొచు. ఇటీవలే కాలంలో గ్లామర్ కథానాయికలకు ఎక్కువ డిమాండ్ ఏర్పడుతున్న నేపథ్యంలో ఈమెకు తప్పకుండా అలాంటి గుర్తింపు రావడం ఖాయం అని చెప్పొచు.
పెళ్లి సందడి సినిమాలో ఆమె గ్లామర్ కే ప్రేక్షకులు ఫుల్
ఫిదా అయ్యారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
సినిమా సూపర్ హిట్ అయితే ఈమె మరింతగా పారితోషకం పెం చుతుంది అని చెప్పవచ్చు.