ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం తన అడుగులను వేస్తోంది. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో టికెట్ రేట్లు బాగా తగ్గిస్తూ నిర్ణయాన్ని తీసుకోవడంతో అభ్యంతరాలు వచ్చాయి.. అయితే ఇటీవల సినిమా టికెట్స్ పై సరికొత్త జీవోను విడుదల చేసి టిక్కెట్ ధరలను పెంచడం జరిగింది. అయితే అటు ప్రజలకు భారం కాకుండా ఇటు నిర్మాతలకు నష్టం వాటిల్లకుండా ఉండేలా టిక్కెట్ ధరలను నిర్ణయించినట్లు తెలుస్తోంది.


అయితే ఈ కొత్త జీవో పై టాలీవుడ్ లోని ప్రముఖులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్లో సినిమా టికెట్ల విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టిన్నట్లుగా తెలుస్తోంది. సినిమా టిక్కెట్ల విక్రయల కోసం ఈ ఆన్లైన్ టికెట్ బుకింగ్ చేసుకునే విధానాన్ని తీసుకురాబోతున్నారు అని గతంలో కూడా తెలియజేశారు. ఈ టికెట్ల బాధ్యతను APFC కి అప్పగించినట్లు గా తెలియజేయడం జరిగింది. ప్రభుత్వమే ఆన్లైన్ టికెట్ విధానాన్ని సినీ ప్రముఖులు కూడా స్వాగతించారు. అసలు ఈ ఇలాంటి విధానాన్ని తీసుకు రమ్మని చెప్పింది కూడా తామేనని పలువురు పెద్దలు కూడా తెలియజేశారు. వీటిని వీలైనంత త్వరగా ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రయత్నిస్తూనే ఉంది.

ఇక ఈ విషయాన్ని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తెలియజేశారు. వీటి కోసం ప్రైవేట్ టికెటింగ్ సంస్థల్ని టెండర్ల కి ఆహ్వానించామని తెలిపారు. దీనికోసం బుక్ మై షో, జస్ట్ టికెట్ వంటి పలు కంపెనీలు కూడా పాల్గొనడం జరిగింది అట. అయితే ఇందులో జస్ట్ టికెట్ సమస్థ మాత్రం ఏపీలో ఆన్లైన్ టికెట్ విధానాన్ని నిర్వహణను సొంతం చేసుకున్నట్లు గా సమాచారం. అయితే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నది. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆన్లైన్ టికెట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: