మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించాడు. ముఖ్యంగా ఉత్తరాదిన ఆయన తన నటనతో ప్రేక్షకులను బాగానే అలరించాడని చెప్పవచ్చు. ఈ సినిమా లో ఇద్దరు హీరోలు నటించగా ఇద్దరిలో రామ్ చరణ్ పాత్రకే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ విధంగా దక్షిణాది తో పాటు ఉత్తరాదిన కూడా ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఇప్పుడు అక్కడ మంచి డిమాండ్ నెలకొంది అని చెప్పవచ్చు.
గతంలో రామ్ చరణ్ బాలీవుడ్ లో జంజీర్ అనే సినిమా చేశాడు. ఇది చరణ్ కు తొలి హిందీ సినిమా కాగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టులేకపోయినప్పటికీ ఆయనకు కొంత మార్కెట్ అయితే ఏర్పడింది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సినిమాతో మార్కెట్ ని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేశాడు. అయితే మధ్యలో కూడా ఆయన హిందీ సినిమాలు చేసి ఉంటే బాగుండేదేమో అని కొంతమంది చెప్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు రామ్ చరణ్ భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించే విధంగా ముందుకు వచ్చాడు ఆర్.ఆర్.ఆర్ సినిమా తో.
చరణ్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు అని అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన గురించి బాలీవుడ్ లో మరిన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నచ్చితేనే పొగడడం, నచ్చకపోతే విమర్శించడం వంటివి చేసే బాలీవుడ్ మీడియా ఇప్పుడు రామ్ చరణ్ బాగా చేయడం గురించి ఎక్కువగా పాపులర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో చరణ్ తన పాన్ ఇండియా కెరీర్ పైనే పూర్తి దృష్టి పెట్టాడు. ఈ చిత్రం తర్వాత కూడా ఆయన తెలుగులో పలువురు దర్శకులతో సినిమాలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ లైనప్ ఆయనకు దేశవ్యాప్తంగా క్రేజ్ ను ఏ స్థాయిలో పెంచుతుందో చూడాలి. శంకర్ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఆయన ఓ సినిమా చేస్తున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి