రాధ శ్యామ్,  త్రిబుల్ ఆర్ లాంటి పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఆచార్య. చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్  కూడా కీలక పాత్రలో నటిస్తూ ఉండడంతో మెగా అభిమానులు ఇక ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వరకు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఒకే సినిమాలో కనిపించారు. కానీ గెస్ట్ రోల్ కి మాత్రమే పరిమితం అయ్యారు.


 కానీ మొదటిసారి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మెగా మల్టీస్టారర్ గా మారిపోయింది ఆచార్య సినిమా. ఈ క్రమంలోనే ఇక ఈ సినిమా అప్డేట్ కోసం అటు మెగా అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.


 ఈ క్రమంలోనే అభిమానులు నిరీక్షణ తీరబోతుంది అన్నది అర్థమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ట్రైలర్ రేపు రిలీజ్  చేస్తారు అనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్లో జోరుగా జరుగుతోంది.  ఇక ఈ సస్పెన్స్ పై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇక ప్రచారం జరుగుతున్నట్లుగా రేపే ఆచార్య ట్రైలర్ వస్తే బాగుండు అని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక పోతే ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. ఇక రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే మొదటిసారి జతకట్టి రొమాన్స్ చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: