దక్షిణాది
సినిమా పరిశ్రమ నుంచి వస్తున్న సినిమాలను చూస్తుంటే
బాలీవుడ్ కొంత అసూయను వ్యక్తపరుస్తూన్నట్లుగా ఆ
సినిమా పరిశ్రమలోని నటీనటులు టెక్నీషియన్లు చేసే వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది
బాలీవుడ్ స్టార్ హీరోలు సౌత్
సినిమా విజయాలను ఒప్పుకోవడం లేదు. దాంతో తమ
బాలీవుడ్ సినిమా పరిశ్రమలో తప్పకుండా మంచి సినిమాలు చేయాలని వారు భావిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ పుష్ప
కేజీఎఫ్ వంటి సౌత్ సినిమాలు ఇప్పుడు హిందీలో భారీ విజయాలను సొంతం చేసుకోగా ఆ స్థాయిలో ఒక్క
బాలీవుడ్ సినిమా కూడా విజయాన్ని అందుకోలేదు అని చెప్పాలి.
వేయి కోట్ల రూపాయలను టార్గెట్ చేస్తూ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీసు వద్ద ఆ మార్కును అందుకునే విధంగా ముందుకు దూసుకు పోతున్నాయి. ఆ విధంగా ఈ ఏడాది ప్రారంభం అయ్యి నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా కూడా
హిందీ లో ఒక్క
బాలీవుడ్ సినిమా కూడా ఆ స్థాయిలో రాకపోవడం వారిని మరింత అవమాన పరుస్తుంది. ఒకటి రెండు సినిమాలు హిందీలో హిట్ దక్కించుకుని వసూళ్ళ పరంగా సౌత్ సినిమాలకు పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ భారీ స్థాయిలో మాత్రం పోటీ ఇవ్వలేక పోతున్నాయి. తాజాగా
షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న
జెర్సీ సినిమా రాగా అది తప్పకుండా సూపర్ హిట్ అయ్యి పోటీ ఇస్తుందని నమ్మారు.
సౌత్
సినిమా లకు ఈ
సినిమా గట్టి పోటీ ఇస్తుంది అని అందరూ భావించారు. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి కానీ కలెక్షన్స్ మాత్రం ఆ స్థాయిలో రాలేదనే చెప్పాలి. సౌత్ సినిమాలు వంద కోట్ల రూపాయలను రోజుకు సాధిస్తూ ఉంటే
బాలీవుడ్ ఓవరాల్ కలెక్షన్స్ అంత ఉండడం లేదు. ఆ సినిమాలు దానికి దరిదాపుల్లో కూడా వెళ్లకపోవడం మరింత బాధిస్తుంది. కే జి ఎఫ్
సినిమా తో పోటీపడలేక ఈ
జెర్సీ సినిమా ఇలా వెనుకబడి పోయింది అని అందరూ అంటున్నారు. ఈ చిత్రం విడుదలై పదిహేను రోజులు అవుతున్నా కూడా ఈ సినిమాకు అక్కడ ఇంకా క్రేజ్ ఉండటం నిజంగా మంచి విషయం. గతంలో కూడా
కేజీఎఫ్ సినిమా విడుదల సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకోడం కరెక్ట్ కాదని ఇప్పుడు విడుదల చేయగా ఇప్పుడు కూడా ఆ
సినిమా యొక్క ప్రభావం ఉంది. మరి ఇంకా ఎన్ని రోజులు
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ నిద్రలేని రాత్రులు గడుపుతారో చూడాలి.