విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా ప్రస్తుతం తెరకెక్కుతుంది. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. దాదాపు 200 మందికి పైగా టెక్నీషియన్లు అక్కడికి వెళ్లి ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 50 కోట్ల పైచిలుకు బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా యొక్క తొలి షెడ్యూల్ ను కశ్మీర్లో చేయడం విశేషం.
అర్జున్ రెడ్డి సినిమా తో ఒక్కసారిగా భారీ క్రేజ్ ను అందుకున్న ఈ హీరో ఇప్పుడు కూడా ఆ క్రేజ్ కు తగ్గట్టు గానే సినిమాలు చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేసిన విజయ్ దేవరకొండ త్వరలోనే జనగణమన అనే సినిమాను కూడా చేయనున్నాడు. ఆ విధంగా ఒకే దర్శకుడు తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం జరుగుతుంది ఈ హీరో. ఈ నెలలో ఈ చిత్రాన్ని మొదలు పెట్టే విధంగా ప్రణాళికలు జరుపుతున్నారు. లైగర్ సినిమాను ఆగష్టులో విడుదల చేసి ఆ తర్వాత సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని చేయడానికి వెళ్లబోతుంది అదే చిత్ర బృందం.
ఈ సినిమాలు మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ సుకుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ విధంగా సినిమా సినిమాకు తన రేంజ్ మరియు క్రేజ్ పెంచుకుంటూ పోతూ విజయ్ ప్రేక్షకులలో మంచి గుర్తింపును సాధించుకుంటున్నాడు. ఇక శివ నిర్వాణ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్ అనుకుంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు విజయ్ దేవరకొండ సినిమాకు లింక్ ఉందట అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టబోతున్నారు. మరి ఈ చిత్రం కూడా ఆ స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది అనేది చూడాలి. దీన్ని బట్టి త్వరలోనే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా తన సత్తా చాట పోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి