గతంలో ఒక సినిమాకు సంబంధించిన విడుదల జరుగుతుంది అంటే అలా విడుదల ఫిక్స్ చేసిన తర్వాత ఏ రకమైన కారణం వల్ల కూడా పోస్ట్పోన్ అవడం జరిగేది కాదు కానీ ఇటీవల సినిమా రిలీజ్ ఫిక్స్ చేసిన తర్వాత సినిమా విడుదల వాయిదా పడడం అనేది ఎక్కువగా జరుగుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతి సినిమాకి కూడా ఈ విధమైన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఏ స్థాయిలో పరిస్థితులు తారుమారు అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని అతి పెద్ద సినిమాగా చెప్పుకునే ఆర్ ఆర్ ఆర్ సినిమాకి సైతం ఈ విధమైన  వాయిదాల పరిస్థితి ఎదురు అయ్యింది. అంత పెద్ద సినిమాకే ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురైనా నేపథ్యంలో చిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని చెప్పవచ్చు. రాబోయే రెండు మూడు నెలల్లో విడుదల కాబోయే సినిమాలు ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమాలు కాగా అవి ఇప్పుడు అవుతూ ఉండడం నిర్మాతలను మరింతగా ఇబ్బంది పెట్టిస్తుంది.

 ఆ విధంగా రాబోయే రెండు నెలల్లో ఏ సినిమాలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు ఇప్పుడు చూద్దాం అడివి శేష్ హీరోగా నటించిన సినిమా అలాగే రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ అనిల్ రావిపూడి దర్శకత్వం లో రాబోతున్న నాని హీరోగా నటించిన సినిమాలు ఇవన్నీ కూడా ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమాలు కారణంగా కొన్ని సార్లు ఇవి పోస్ట్ పెద్ద సినిమాలు విడుదల నేపథ్యంలో ఈ చిత్రాలు వాయిదా పడక తప్పలేదు. మరి భవిష్యత్తులోనైనా ఈ తరహాలో సినిమాలు వాయిదా పడకుండా ఉంటాయా అనేది చూడాలి. రాబోయే రోజుల్లో మళ్ళీ కరోనా రాబోతుంది అంటున్న నేపథ్యంలో రాబోయే రోజులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తాయో అన్న భయాన్ని సినిమా మేకర్స్ వ్యక్తపరుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: