సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు.  వారిలో కొంత మంది మాత్రమే మొదటి సినిమాతో మంచి విజయాన్ని అలాగే మంచి క్రేజ్ ను దక్కించుకొని ఆ తర్వాత కూడా వరుస పెట్టి క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటారు. అలా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అలాగే సూపర్ క్రేజ్ ను దక్కించుకున్న ముద్దుగుమ్మలో కీర్తి సురేష్ ఒకరు.  కీర్తి సురేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నేను శైలజ మూవీ తోనే మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కించుకుంది.  

ఆ తర్వాత నుంచి కీర్తి సురేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమాల్లో నటిస్తూ వస్తోంది.  ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ గ్లామర్ పాత్రలకు కాస్త దూరంగా ఉంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ వస్తుంది.  అందులో భాగంగా ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది.  ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ సూపర్ స్టార్  మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమా మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో  కీర్తి సురేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.  

ఈ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్,  మహేష్ బాబు గురించి చెబుతూ...  మహేష్ బాబుతో షూటింగ్ చాలా సరదాగా, ఫన్నీగా ఉంటుంది అని చెప్పింది.  ఓ సాంగ్ షూటింగ్ సందర్భంగా తాను టైమింగ్ ను కోల్పోయానని, స్టెప్ లు మరిచిపోయానని , ఆ సమయంలో మహేశ్ మొహం పై రెండు సార్లు మిస్ టైమింగ్ తో కొట్టానని కీర్తి సురేష్ చెప్పింది. అప్పటికే సారీ చెప్పానని, మూడో సారీ కూడా అది రిపీట్ అయిందని కీర్తి సురేష్ పేర్కొంది.  అలా జరిగే సరికి నా గుండె వేగం పెరిగింది అని కీర్తి సురేష్ తెలియజేసింది.  నా మీద నీకు ఏమైనా పగ ఉందా అని మహేష్ బాబు సరదాగా అడిగాడు అని కీర్తి సురేష్ తాజా ఇంటర్వ్యూలో తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: