ఒక సినిమాలో ఒక పాత్ర కోసం ఒక హీరోను దర్శకుడు సంప్రదించిన సందర్భంలో ఆ హీరోకు ఆ  కథ నచ్చకనో  లేదా ఆ సమయంలో ఆ హీరో ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్లు సర్దుబాటు చేయలేక ఆ సినిమా నుండి తప్పుకోవడం,  అలా ఆ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ దర్శకుడు వేరే  హీరోతో ఆ సినిమాను తెరకెక్కించడం ఇలా జరగడం అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా సాధారణం.  

అయితే అలా హీరోలు వదులుకున్న సినిమాలలో కొన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడితే,  మరి కొన్ని సినిమాలు మంచి విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకుంటాయి. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న ఒక సినిమా అవకాశం అల్లు అర్జున్ కి వచ్చిందట.  ఆ సినిమాతో అల్లు అర్జున్ మంచి విజయాన్ని మరియు మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  ఆ సినిమా గురించి తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుల్లో ఒకరైన గుణశేఖర్ ,  అనుష్క ప్రధాన పాత్రలో రుద్రమదేవి సినిమాను తెరకెక్కించిన  విషయం మన అందరికి తెలిసిందే.  ఈ సినిమాలో రానా ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు.  అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్  కీలకమైన  గోన గన్నారెడ్డి పాత్రలో నటించాడు.  అయితే మొదట అల్లు అర్జున్ 'రుద్రమదేవి'   సినిమాలో నటించిన గోన గన్నారెడ్డి పాత్ర కోసం దర్శకుడు గుణశేఖర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ను  సంప్రదించాడట,  కానీ కొన్ని కారణాల వల్ల సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా నిరాకరించడంతో గుణశేఖర్ ఆ తర్వాత రుద్రమదేవి మూవీ లోను గోన గన్నారెడ్డి పాత్ర కోసం ఎన్టీఆర్ ను సంప్రదించాడట,  ఎన్టీఆర్ కూడా కొన్ని కారణాల వల్ల ఈ పాత్రను రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత గుణశేఖర్ 'రుద్రమదేవి'  మూవీ లోని గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ కు వినిపించగా అల్లు అర్జున్ ఓకే చెప్పాడట.  అలా అల్లు అర్జున్ 'రుద్రమదేవి' మూవీ లోని గోన గన్నారెడ్డి పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: