వరుస విజయాలతో ముందుకు దూసుకు పోతున్నాడు అక్కినేని వారి హీరో నాగచైతన్య. పోయినేడాది లవ్ స్టోరీ చిత్రం తో సంచలన విజయాన్ని అందుకున్న ఈ హీరో ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న థాంక్యూ సినిమా త్వర లో విడుదలకు సిద్ధంగా ఉంది. వినూత్నమైన సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తోంది.

త్వరలోనే ఈ సినిమా విడుదల గురించిన వివరాలు తెలియనున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి ఓ వె బ్ సిరీస్ చేయడం అక్కినేని అభిమానులను ఎంతో సంతోష పడుతుంది. ఎంతో వెరైటీగా ఈ వెబ్ సిరీస్ ఉండబోతోందని తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్లో మనం సినిమా ఎంతటి సక్సెస్ను సాధించింది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడానికి ఇంత సమయం పట్టగా వెంటనే ఈ వెబ్ ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టడం విశేషం. ఈ సినిమా కథ కూడా వెరైటీగా ఉండబోతుంది అని తెలుస్తుంది.

ఇప్పటిదాకా అక్కినేని హీరోలు 100 కోట్ల మార్కును అందుకోలేక పోతున్నారు అనే విమర్శ ఉంది ఈ సినిమా తో తప్పకుండా అక్కినేని నాగచైతన్య ఆ మార్కే ను అందుకోవడం ఖాయం గా చెబుతున్నారు అక్కినేని అభిమానులు. ఇతర హీరోలైన అక్కినేని అఖిల్ కూడా ఈసారి ఏజెంట్ సినిమా 100 కోట్ల మార్కును అందుకోవడం ఖాయం అని అంటున్నారు ఈ నేపథ్యంలో అక్కినేని హీరోసినిమా ఆ స్థాయి రికార్డులను అందుకుంటారు అనేది చూడాలి. ఇంకొకవైపు అక్కినేని నాగార్జున కూడా ఆ స్థాయిలో సినిమాలు చేయడం విశేషం. మరి ఈ ముగ్గురిలో ఎవరు వంద కోట్ల మార్క్ అందుకుని అక్కినేని వారిపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: