నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో గా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.  అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక  సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ కొన్ని రోజుల క్రితం విడుదలైన అఖండ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు.  అఖండ సినిమా కంటే ముందు వరుస అపజయాలతో డీలా పడిపోయిన బాలకృష్ణ అఖండ విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు.

అఖండ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుండగా ,  ప్రతినాయకుడి పాత్రలో దునియా విజయ్ మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించబోతోంది.  ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. బాలకృష్ణ ఒక పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది.  

బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో దర్శకుడు గోపీచంద్ మలినేని అదిరిపోయే ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేసినట్లు , ఆ సాంగ్ షూటింగ్ మే 16 వ తేదీ నుండి మే 20 వ తేదీ వరకు రామోజీ ఫిలిం సిటీ లో జరగనున్నట్లు,  ఆ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: