మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మాస్ సినిమాలకు కెరాఫ్ అడ్రెస్ ఈయన..ఎన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉంది..అనే విధంగా రవి తేజ సినిమాలు వరుస ప్లాఫ్ లను అందుకున్నాయి.ఇకపోతే మొన్నీ మధ్య వచ్చిన క్రాక్ సినిమా తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన హీరో కు ఖిలాడి సినిమాతో మరొక ప్లాప్ పడింది. అయిన రవితేజ డేర్ చేస్తున్నాడు.. చేతిలో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ధమాకా షూటింగ్ లో రవి తేజ బిజీగా ఉన్నాడు.


ధమాకా చిత్రంలో రవితేజ డ్యుయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా లో ఆయన పాత్రకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండటం తో ఈ సినిమాలో రవితేజ పాత్రలను ఆయన ఎలా డిజైన్ చేశాడా అనే టాక్ ఇంట్రెస్టింగ్ గా మారింది. తాజాగా సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్తలు సినిమా పై గందరగోళాన్ని ఏర్పడేలా చేస్తున్నాయి. సినిమాలో రవితేజ పాత్రలు అల్టిమేట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ ఫస్టాఫ్ లో కనిపించే పాత్ర చాలా కూల్ గా ఉంటుందని, ఆయన తరుచూ చేసే పాత్రల లాగే ఉంటుందని టాక్.. ఇకపోతే సెకండ్ ఆఫ్ లో రవితేజ కంప్లీట్ గా నెగిటివ్ షెడ్ లో కనిపిస్తారని సమాచారం. రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలా నటిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ఈ సినిమా పై మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ సినిమా తో రవితేజ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందిస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: