టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఆ తర్వాత ఫలక్ నామ దాస్ , హిట్ , పగల్ , అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి పలు సినిమాల్లో హీరోగా నటించాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ సేన్ 'అశోకవనంలో అర్జున కల్యాణం' మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది.  

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకున్న అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ ఇప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.  ఇలా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న విశ్వక్ సేన్ తన రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా వరకు విశ్వక్ సేన్ 1.50 కోట్ల నుండి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా వరకు అంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న విశ్వక్ సేన్సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసి నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే...  ప్రస్తుతం విశ్వక్ సేన్ ను ఏదైనా సినిమా కోసం సంప్రదించినట్లు అయితే ఈ హీరో ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ ను అడుగుతున్నట్లు తెలుస్తోంది.  దానితో కొంత మంది విశ్వక్ సేన్ లాంటి హీరోకు మూడు కోట్ల రెమ్యునరేషన్ పెద్ద విషయమేమీ కాదు అని తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: