టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నిఖిల్ సిద్ధార్థ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ సిద్ధార్థ్ వెండి తెరపై ప్రేక్షకులను అలరించి చాలా కాలమే అవుతుంది.  నిఖిల్ సిద్ధార్థ్ 'అర్జున్ సురవరం' మూవీ తో ప్రేక్షకులను వెండితెరపై పలకరించాడు.  ఈ మూవీ లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా,  టి. సంతోషిమూవీ కి దర్శకత్వం వహించాడు. అర్జున్ సురవరం సినిమా తర్వాత  వెండితెర ద్వారా ప్రేక్షకులను అలరించలేకపోయిన నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం 18 పేజిస్, కార్తికేయ 2 సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు.  

ఈ రెండు మూవీ లు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా ఈ రెండు మూవీ లు విడుదలకు సిద్ధంగా ఉన్న సమయం లో నిఖిల్ సిద్దార్థ్ తాజాగా మరో మూవీ ని సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు.  తాజాగా నిఖిల్ 'స్పై'  అనే మూవీ ని ప్రారంభించాడు.  ఈడీ ఎంటర్టైన్ మెంట్  సంస్థ ఈ సంస్థ ఈ మూవీ ని నిర్మిస్తుండగా , ఈ మూవీ కి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో శర వేగంగా పూర్తి చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.  స్పై  మూవీ కి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చబోతున్నాడు. 

మూవీ లో నిఖిల్ సిద్ధార్థ్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ మూవీ ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి దసరాకు విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నిఖిల్ కెరియర్ లోనే ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.  ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ మాస్టర్ విటేకర్ పని చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: