విజయ్ దేవరకొండ హీరోగా ఖుషి అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత కథానాయిక గా నటిస్తుండగా రొమాంటిక్ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మహానటి సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ స్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయి. ఆ విధం గా ఖుషి అనే టైటిల్ ను ఇటీవలే రివీళ్ చేసిన చిత్ర బృందం సినిమా పై అంచనాలను భారీ స్థాయిలో పెంచింది అని చెప్పాలి.

చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. కాశ్మీర్ లో పలు కీలక ఘట్టాలు తెరకెక్కుతున్నాయి. ఆ తర్వాత జూన్ రెండో వారం నుంచి ఈ సినిమా కు సంబంధించిన తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనున్నట్లు తెలుస్తోంది.  ఇది ఏకంగా పది రోజుల షెడ్యూల్ అని చెబుతున్నారు. మరి ఈ సినిమా పై ఎంత నమ్మకం లేకుంటే ఈ సమయంలో విజయ్ దేవరకొండ ఈ సినిమాను ఒప్పుకుంటాడు.

దర్శకుడు శివ నిర్వాణ కు దీనికంటే ముందు చేసిన సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. దాంతో ఈ సినిమా చేయాలా వద్దా అన్న మీమాంసలో అంద రూ ఉన్నారు. అయితే దర్శకుడు ఏ విధంగా ఈ సినిమా ను ఒప్పించాడో తెలియదు కానీ ఈ సినిమా చేయడం విజయ్ దేవరకొండ తీసుకున్న కీలకమైన నిర్ణయం అనే చెప్పాలి. డిసెంబర్ 23వ తేదీన ఈ సిని మా విడుదల కాబోతోంది. దానికంటే ముందు లైగర్ చిత్రం విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా తర్వాత చేస్తున్న ఈ ప్రేమ కథ సినిమా ఏ విధంగా ప్రేక్షకులు స్వాగతిస్తారో చూడాలి.ఈ చిత్రం తర్వాత అయన చేసే సినిమాలు ఏ స్థాయి లో ఉంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: