సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట' తొలుత నెగిటివ్ టాక్ తో డౌన్ అవ్వగా ఆ తరవాత 'పుష్ప' సినిమా తరహాలో ఊపందుకుని సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన నూతన చిత్రం సక్సెస్ అయిన ఆనందంలో ఉన్న మహి త్వరలో పాన్ ఇండియా చిత్రంతో బిజీ కానున్నారు. అదేనండి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ దర్శకుడు రాజమౌళితో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు కూడా, అయితే జక్కన్నతో చిత్రం అంటే రెండేళ్లు కంటే ఎక్కువ సమయం కేటాయించాల్సిందే అన్నది తెలిసిందే.

కాగా మరి ఇంత ఎక్కువ గ్యాప్ అంటే మహికి కొంచం కష్టమే. మొదట్లో ఇలాంటి లైన్ లోనే ఉన్న ఈ మధ్య మహి కూడా వరుస పెట్టి సినిమాలు ఫటా ఫట్ చేస్తున్న తరుణంలో జక్కన్నతో తదుపరి చిత్రం కాస్త ఆలస్యం అయ్యేట్లు  కనిపిస్తున్న నేపథ్యంలో ఈ గ్యాప్ లో ఒక సినిమా చేస్తే బాగుంటుందని మహేష్ బాబు అనుకున్నట్లు తెలుస్తోంది.  కాగా ఈ సంగతి తెలిసి కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మహి కోసం ఒక కథ సిద్ధం చేసి ఇటీవలే వెళ్లి వినిపించగా.... మహి రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీలో టాక్. ఉన్న గ్యాప్ లో వేరే సినిమా చేయాలని మహికి ఉన్న కోలీవుడ్ దర్శకులతో ఇప్పట్లో సినిమా చేసే ఉద్దేశం లేకపోవడం వలనే స్టోరీ నీ రిజెక్ట్ చేశారని అంటున్నారు.

ఎందుకంటే ఆల్రెడీ మురుగదాస్ డైరెక్షన్ లో చేసిన మూవీ స్పైడర్ డిజాస్టర్ గా మిగలడం తో ఇప్పుడప్పుడే తమిళ దర్శకులతో వద్దు అనుకున్నారని వినికిడి.  అయితే ఈ కోలీవుడ్ దర్శకుడు తమిళ్ లో బాగా ఫేమస్.  విజయ్ తో మాస్టర్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు.  అయితే మహి మళ్ళీ వేరే మన టాలీవుడ్ దర్శకుల కైన కనెక్ట్ అయ్యి సినిమా చేస్తారా...లేక ఒకేసారి జక్కన్న తోనే అని వెయిట్ చేస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: