దర్శకుడు కావడం అంటే సాధారణమైన విషయమా ? అసిస్టెంట్ డైరెక్టర్ గా ఏళ్లతరబడి చేసి నానాతంటాలు పడి ఎదో ఒక సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం అందుకుని ఆ తరవాత వారి ఓన్ టాలెంట్ ఎంతో స్క్రీన్ పై కనబరిచి సినిమా హిట్ అయితే లైఫ్ లేదంటే అక్కడితో వెనుతిరగాల్సిందే. సినిమా హిట్ అయ్యాక కూడా చాలా పజిల్సే ఉంటాయి. మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటే ఇక ఆ దర్శకుడి పై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి, వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వస్తే మరింత జాగ్రత్త తప్పనిసరి కంగారు పడో లేక అత్యుత్సాహంతో అటు ఇటు కాకుండా తీసేస్తే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఈ కష్టాల గురించి దర్శకుడు రాధ కృష్ణకు బాగా తెలుసు అంటున్నారు కొందరు.

ఎందుకయ్యా అంటే తొలి చిత్రం జిల్ తో సూపర్ హిట్ ను అందుకున్న ఈ దర్శకుడు రావడం రావడం ఆ తరవాత పాన్ ఇండియా చిత్రాన్ని చేత పట్టాడు. తన టాలెంట్ కి అతి పెద్ద విషయం కాదనుకోండి, అయితే ప్రభాస్ లాంటి పెద్ద హీరో తో సినిమా అంటే చాలా ఈక్వేషన్స్ ను క్లియర్ చేసి రీచ్ అవ్వాలి లేదంటే తేడా వచ్చేస్తుంది. ఇదే తరహాలో పలు కారణాల వలన రాధే శ్యామ్ సినిమా కాస్త డిజాస్టర్ గా మారడంతో డైరెక్టర్ రాధాకృష్ణకు ఇపుడు కెరియర్ ప్రశ్నార్ధకంగా మారిందనే చెప్పాలి. ఇక అదే కాకుండా మొదటి సినిమా జిల్ కి రెండవ సినిమా రాదేశ్యామ్  కి మధ్య ఏకంగా ఏడేళ్ల గ్యాప్ ఉండటం ఈ దర్శకుడికి మరో మైనస్ గా మారింది.
   
ఇదే తరహాలో సేమ్ రూట్ లో చిక్కు పోతున్నాడు మరో దర్శకుడు అని అంటున్నారు. ఇంతకీ అతడు మరెవరో కాదు ఉప్పెన వంటి బిగ్గెస్ట్ హిట్ ను ఇండస్ట్రీకి అందించిన దర్శకుడు బుచ్చి బాబు. మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన ఈ డైరెక్టర్ తదుపరి ఏ హీరోతో చేస్తారా అన్న అంశంపై అందరూ ఆసక్తిగా ఉండగా... లేట్ అయినా సరే నా నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తోనే అంటూ పట్టుబట్టి కూర్చున్నారు ఈ దర్శకుడు. పోనీ అదయినా జరుగుతుందా అంటే ఇప్పట్లో కుదిరేపని కాదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాలతో బిజీగా ఉండగా ..ఆ తరవాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నారు. ఇవన్నీ అయ్యి బుచ్చి బాబుతో సినిమా అంతే అటూ ఇటూ ఇంకో మూడేళ్ల పై మాటే మరి అప్పటి దాకా ఏ సినిమా చేయకుండా తారక్ కోసమే వెయిట్ చేస్తూ కూర్చుంటే మొదటి సినిమాకి రెండో సినిమాకి నాలుగైదు ఏళ్లు గ్యాప్ వచ్చేస్తుంది. అయితే ఒక మంచి దర్శకుడుగా ఎదగాలి అంటే మరీ ఇంత గ్యాప్ మంచిది కాదు...మరి బుచ్చి బాబు ఏం డిసైడ్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: