అక్కినేని అఖిల్ తన ఐదవ సినీమాగా ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. స్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అనీల్ సుంకర నిర్మాతగా ఏకె ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ ఈ సినిమా నిర్మిస్తుంది. సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. అందుకోసమే ఈ మూవీ కోసం అఖిల్ తన లుక్ మార్చేశాడు. కంప్లీట్ మాస్ లుక్ తో డ్యాషింగ్ గా కనిపిస్తున్నాడు అఖిల్.

ఇక ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ ఒకటి కాగా సినిమా తెరకెక్కిస్తున్న క్రమంలో బడ్జెట్ అంచనాలను మించినట్టు తెలుస్తుంది. అయితే కంటెంట్ పర్ఫెక్ట్ గా ఉండటంతో ఆ నమ్మకంతో నిర్మాత అనీల్ సుంకర ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఖర్చు పెట్టేస్తున్నారని తెలుస్తుంది. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ ఏజెంట్ సినిమా కు దాదాపు 80 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నారని తెలుస్తుంది.

అదే నిజం అయితే అఖిల్ కెరియర్ లో ఇది హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరియర్ లో మొదటి హిట్ అందుకున్న అఖిల్ అలా హిట్టు పడ్డదో లేదో తన నెక్స్ట్ సినిమానే భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. సురేందర్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో అఖిల్ కూడా ఈ సినిమాపై పూర్తి కాన్ ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ కూడా చాలా బాగా వచ్చిందని చిత్రయూనిట్ చెబుతున్నారు.

అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బ్యాచిలర్ క్లాస్ హిట్ అందుకోగా ఏజెంట్ మాత్రం మాస్ ఆడియెన్స్ ని మెప్పించి మాస్ హిట్ అందుకుంటుందని చెబుతున్నారు. బ్యాచిలర్ హిట్ మేనియా కొనసాగించేలా ఏజెంట్ తో మరో హిట్ టార్గెట్ పెట్టాడు అఖిల్. అనుకున్న విధంగా సినిమా ఆడియెన్స్ ని మెప్పిస్తుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: