దర్శకుడు కొరటాల శివ సినిమాలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందుకే ఆయన మొదటి నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. పెద్ద హీరోలతో సినిమాలు ఇలానే చేయాలి అని చెప్పి మరి హిట్ కొట్టిన కొరటాల శివ గత సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఆచార్య చిత్రం యొక్క ఫ్లాప్ పూర్తిగా కొరటాల శివ పై ప్రభావం చూపించడం తో ఇప్పుడు ఆయన మరొకసారి తన సత్తా చాటుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు స్టార్ హీరోలుగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.  అయితే కథ పరంగా అంతటి అంచనాలను అందుకోలేక పోయింది ఈ సినిమా. దాంతో అందరూ కూడా ఈ సినిమా బాగోలేదని చెప్పి డిజాస్టర్ చేశారు. అయితే కొరటాల శివ స్టైల్ మాత్రం ఈ సినిమాలో ఏమాత్రం మిస్ అవ్వలేదు.అలా ఎన్నో నిరాశల మధ్య కొరటాల శివ ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం తప్పకుండా భారీ విజయాన్ని అందుకోవాలని అవసరం ఏర్పడింది. లేదంటే మరొకసారి బాక్సాఫీస్ కొరటాల శివ పరువు పోయే అవకాశం ఉంది. 

గతంలో ఎన్టీఆర్ తో కలిసి జనతాగ్యారేజ్ అనే సినిమా చేశాడు కొరటాల శివ. ఈ చిత్రం తప్పకుండా ఆ చిత్రం స్థాయిలోనే తెరకెక్కుతోందని అంటున్నారు. అంతే కాదు గతంలో తెరకెక్కిన ఆయన సినిమాల కంటే వైవిధ్యభరితమైన కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది అని అంటున్నారు. మెసేజ్ కం కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా ఉండబోదు అని అంటున్నారు.  హిట్ వచ్చినప్పుడు తమ తదుపరి సినిమా ఎంతో జోష్ తో చేస్తూ ఉంటారు దర్శకులు. అదే ఫ్లాపు వచ్చిన తర్వాత ఎంతో జాగ్రత్తగా తమ తదుపరి సినిమాలు చేసి హిట్ కొట్ట వలసి ఉంటుంది.  ఆ విధంగా ఇటువంటి పరిస్థితిని తొలిసారి ఎదుర్కొంటున్న కొరటాల శివ ఈ చిత్రాన్ని ఏ స్థాయిలో చేసి హిట్ కొడతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: