ఆ స్టార్ హీరోలు వచ్చి అడిగినా నేను వారితో సినిమాలు తీయను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ దర్శకుడు కమ్ నిర్మాత. అందులోనూ ప్రభాస్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోల పేర్లు చెబుతూ వారు డేట్స్ ఇచ్చిన వారితో సినిమా చేయను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు ఇంతకీ ఎవరా నిర్మాత ? ఎందుకలా అన్నారు అన్నది తెలుసుకుందాం.  టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిర్మాతల్లో ఎంఎస్ రాజు కూడా ఒకరు. ఇప్పటి వరకు పలువురు హీరోల చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఈయన ఈ మధ్యే దర్శకుడిగా కూడా మారిన విషయం తెలిసిందే. అటు నిర్మాతగా ఇటు నిర్మాతగా ఇండస్ట్రీలో డ్యుయల్ రోల్ పోషిస్తున్నారు ఎం ఎస్ రాజు.

 ఎం ఎస్ రాజు నుండి మరో ప్రాజెక్ట్ త్వరలో మనముందుకు రాబోతుంది.   సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన 7 డేస్ 6నైట్స్ అనే సినిమాని  ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సర్వం సిద్ధం చేశారు ఎం ఎస్ రాజు అండ్ టీం. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ ఆసక్తికర  వ్యాఖ్యలు చేయడంతో విషయం వైరల్ గా మారింది.  పౌర్ణమి చిత్రం తరవాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను,  ఎన్నో అంచనాల మద్య రూపొందించిన ఊహించని విధంగా ఫెయిల్ అవడంతో షాక్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక చాలా  గ్యాప్ తరవాత మళ్ళీ డర్టీ హరీ అంటూ దర్శకుడిగా మారగా ఆ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చింది. కాగా

కాగా మళ్ళీ ఆ తర్వాత మధ్యలో చాలా మంది హీరోలు తన వద్దకు వచ్చి తమతో  సినిమాలు చేయమని  అడిగారట కానీ ఆయన కుదరదని చెప్పేశాడట.  ఆ లిస్ట్ లో మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నారని చెప్పారు. హీరో రవితేజ కూడా తనతో ఒక సినిమా తీయమని అడగగా అందుకు నో చెప్పాను అని తెలిపారు ఎంఎస్.రాజు. అంతేకాదు మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ కూడా రాగా దానికి కూడా నో చెప్పానని, చెప్పేశారు.  ఆ కథ నచ్చలేదని, అంతే కాకుండా ఆ టైం లో సినిమాలు నిర్మించకూడదని అనుకున్నాను అని అందుకే  ఖలేజా సినిమా కి నేను చేయనని చెప్పాను అంటూ సంచలన విషయాలు వెల్లడించారు.  అనుష్క రుద్రమదేవి సినిమాకు కూడా తన వద్దకు రాగా అది కూడా రిజెక్ట్ చేశారట.  ఇక ఇప్పటి విషయానికి వస్తే.... మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు డేట్లు ఇచ్చినా కూడా సినిమాలు తీయనని తాను ఎంచుకున్న సినిమాలు మాత్రమే చేస్తాను అని షాకింగ్ కామెంట్స్ చేసారు ఎం.ఎస్.రాజు. ఎం.ఎస్.రాజు..

మరింత సమాచారం తెలుసుకోండి: