తమిళ సూపర్ స్టార్ హీరో సూర్య దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు అని చెప్పవచ్చు. ముఖ్యంగా యువత లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య అని చెప్పవచ్చు. ఎంతో సింపుల్ గా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. సూర్య, గజిని చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .ఇక ఆ తర్వాత రక్త చరిత్ర, సింగం, జై భీమ్ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువగా కంటెంట్ ఉన్న సినిమాలనే తెరకెక్కిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉన్నారు.

ఇక సూర్య సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ లు వస్తూనే ఉంటాయి. కానీ తాజాగా సూర్య పేరు గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్లో బాగా వైరల్ గా మారుతోంది. అవును ఇది నిజం ఈ స్టార్ హీరో అసలు పేరు సూర్య కాదు.. ఈ హీరో అసలు పేరు శరవణన్ శివకుమార్. కానీ ఇతనికి సూర్య అనే పేరు డైరెక్టర్ మణిరత్నం పెట్టారట. ఈయన దర్శకత్వంలో వచ్చిన సూర్య నెర్రుక్క నెర్ , నవరస, ఆయుత ఎళుతూ వంటి చిత్రాలలో నటించారు ఇక అదే సమయంలో డైరెక్టర్ మణిరత్నం ఆయనకు సూర్య అనే పేరును ఇకమీదట సినిమా స్క్రీన్ పై ఉపయోగించాలని సూచించారట .మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముఖ్యంగా మణిరత్నం సినిమాలలో ఎక్కువగా ఉపయోగించిన పేరు కూడా ఇదే కావడం విశేషం.

సినీ ఇండస్ట్రీలో మంచి నటనతో ప్రేక్షకులను మైమరిపించిన సూర్య ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. శరవణన్ శివకుమార్ అనే పేరు ఇండస్ట్రీలో గందరగోళంగా ఉంటుంది కాబట్టి సూర్యుడిలా ప్రకాశిస్తూ భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఈ పేరు పెట్టినట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ పాత్రలో నటించాడు. ఈ సినిమా థియేటర్లలో ఒక సంచలనం సృష్టించింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో సూర్య కనిపించింది కేవలం మూడు నిమిషాలే అయినా విక్రమ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది అని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: