టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోలు అంటే అభిమానులకు ఎంత ఇష్టమో. నిత్యం వారి గురించే ఆలోచిస్తూ వారు చేసే సినిమాల పట్ల ఆరా తీస్తూ ఉంటారు. ట్విట్టర్ వేదికగా వారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. హీరోలకు కూడా తమకు ఇంత ఫాలోయింగ్ ఉందా అన్న ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తూ ఉంటారు.  వారు చేసే యాక్టివిటీస్ ని బట్టి ఏ హీరోకి ఎంత క్రేజ్ ఉంటుందో అర్థం అవుతుంది. అలా భారీ క్రేజ్ ఉన్న హీరోల సరసన నటించడానికి ఏ హీరోయిన్ ను ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

టాప్ 5 హీరోల సరసన నటిస్తే తాము కూడా పెద్ద హీరోయిన్ గా ఎదిగి వచ్చు నే ఆశ హీరోయిన్లలో ఉంటుంది. ఆ విధంగా ఓ హీరోయిన్ మహేష్ సరసన నటించడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా అని చెప్పడం జరిగింది. మహేష్ బాబు ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన వరుస సినిమాలు సూపర్ హిట్ కావడం మార్కెట్ కూడా భారీ స్థాయిలో ఉండడం వంటివి ఆయనను టాప్ పోజిషన్ లో నిలబెట్టాయి. 

ఆ విధంగా ఈ హీరోతో పని చేయాలని ప్రతి ఒక్క హీరోయిన్ కూడా కోరుకుంటుంది ఆ జాబితాలో ఇప్పుడు చేరిపోయింది రాశీకన్నా. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా జూలై ఒకటవ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటున్న రాశీ కన్నా ను ఓ విలేకరి ఏ టాలీవుడ్ హీరో తో నటించాలనే కోరిక ఉందని అడగగా మహేష్ బాబు తో నటించాలనే కోరిక ఉంది అని సమాధానం ఇచ్చింది రాశీ. దీంతో మహేష్ అభిమానులు ఆమె కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న మహేష్ బాబు ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. మరి ఆమె కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: