సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమందికి మాత్రమే నటించిన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ విజయాలను అందుకుంటూ ఉంటారు. అలా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న హీరోయిన్లకు క్రేజ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది.

అలాగే అలాంటి ముద్దుగుమ్మలకు సినిమా వరుస మూవీ అవకాశాలు దక్కినట్లు అయితే ఆ అవకాశాలను బట్టి వారి రెమ్యునరేషన్ ను కూడా పెంచేస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో అధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన సందర్భంలో కూడా కొన్ని అవకాశాలు చేజారే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి కూడా ఇలా భారీ మొత్తం రెమ్యునిరేషన్ డిమాండ్ చేయడం వల్ల  అవకాశాలను చేర్చుకున్నట్లు కొన్ని కథనాలు శాండల్ వుడ్ లో  వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే...  అందాల ముద్దుగుమ్మ శ్రీ నిధి శెట్టి 'కే జి ఎఫ్' మూవీ తో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. 'కే జి ఎఫ్ చాప్టర్ 1' మూవీ తో పోల్చుకుంటే 'కే జి ఎఫ్ చాప్టర్ 2' లో ఈ ముద్దుగుమ్మ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ ఉండడం,  అలాగే కే జీ ఎఫ్ చాప్టర్ 2 కూడా భారీ విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కు పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ఏర్పడింది.

ఇలా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఏర్పడడంతో ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్ ను కూడా భారీగా డిమాండ్ చేస్తోంది అని, అందుకోసమే సినిమా అవకాశాలు ఈ ముద్దుగుమ్మకు ఎక్కువగా రావడం లేదు అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ,  శ్రీనిధి శెట్టి మాత్రం తన అందచందాలతో, నటనతో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: