వై. విజయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో సీనియర్ నటీనటులలో ఒకరిగా ఈమె సుపరిచితం. ఇక సీనియర్ నటులకు మళ్లీ విపరీతమైన డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ స్పీడ్ గా దూసుకుపోతున్నారు.ఇక అలాంటి వారిలో అన్నపూర్ణమ్మ తర్వాత వై.విజయ కూడా ఒకరనికూడా చెప్పవచ్చు. వీరిద్దరు కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో ఒక వెలుగు వెలిగిన వీరు మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అంతే జోరు మీద ఉండడం గమనార్హం. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ నటి వై. విజయ ప్రేక్షకులతో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేయడమే కాకుండా తాను ఇలా గొప్ప స్థితిలో ఉండడానికి కారణం ఓ స్టార్ హీరోయిన్ అంటూ కూడా తెలిపింది.ఇక వై.విజయ మాట్లాడుతూ.. విజయశాంతి చెప్పిన మాటల వల్లే మళ్లీ ఈరోజు నేను చాలా సంతోషంగా జీవిస్తున్నాను అని ఆమె తెలిపింది. ఒకప్పుడు మన సౌత్ సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసే సమయంలో ఆర్థికంగా బాగా ఉండేవాళ్లమని ఆమె తెలిపింది. ఇక అదే సమయంలో హీరోయిన్ గా రాణిస్తున్న సావిత్రమ్మ జీవితం చూసిన తర్వాత సినిమా అనేది మన జీవితాంతం ఉండదని అప్పుడే అర్థమైంది అని ఆమె తెలిపింది.


జీవితంలో ఆర్థిక రంగంలో చాలా పైకి ఎదగాలి అంటే సినిమాలు మాత్రమే సరిపోవు అని.. ఇతర రంగాలలో కూడా పెట్టుబడులు పెట్టాలని విజయశాంతి తెలిపినట్లు వై.విజయ తెలిపింది. ఇక అలా మరొక ఆదాయం కోసం ఇలా పెట్టుబడులు పెట్టానని.. ఇక అలా పెట్టిన పెట్టుబడులే ఈరోజు ఆర్థికంగా తనకు మంచి లాభాలను అందించాయని ఆమె తెలిపారు.ఒక రకంగా ఆర్థికంగా తాను ఈ స్థాయిలో ఉండడానికి స్టార్ హీరోయిన్ విజయశాంతి ఒక కారణం అని వై.విజయ స్పష్టం చేశారు. ఇకపోతే షూటింగ్ సమయాల్లో ఎప్పుడు ఖాళీగా ఉన్నా సరే సరదాగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం అని ఆమె తెలిపారు. ఇక అలాంటి ఒక సమయంలో ఇలా పెట్టుబడుల గురించి ప్రస్తావన రాగా దాంతో తాను కూడా పెట్టుబడులు పెడుతూ ఇప్పుడు చాలా సంతోషంగా జీవిస్తున్నామని తెలిపారు.  వై విజయ. ఇక 1961 వ సంవత్సరం నుండి ఇండస్ట్రీలో వున్నారు. దాదాపు వెయ్యికి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: