టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా కెరియర్ లో వెనకపడుతున్నాడు హీరో శర్వానంద్. అతను చేస్తున్న సినిమాలేవి ఈమధ్య బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందుకోవడం లేదు. జాను, శ్రీకారం, మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు వరుసగా నిరాశపరచడంతో శర్వానంద్ కొద్దిపాటి గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఈ గ్యాప్ లో ఈమధ్య తను కొద్దిగా లావయ్యాడన్న కామెంట్స్ రాగా తన ఫిజిక్ మీద దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో శర్వానంద్ వెకేషన్ కి వెళ్లి అక్కడ పర్ఫెక్ట్ వర్క్ అవుట్స్ చేసి పూర్తిగా కొత్త మేకొవర్ తో కనిపించాడు.

శర్వానంద్ లేటెస్ట్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం కథాచర్చల్లో ఉన్న శర్వానంద్ ఇక మీదట మొహమాటాలకు పోయి సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. అంతేకాదు ఫుల్ స్క్రిప్ట్ రెడీగా ఉన్న దర్శకులనే తన దగ్గరకు రమ్మని అంటున్నాడట. న్యూ లుక్ లో కొత్త జోష్ తో కనబడుతున్న శర్వానంద్ ఇప్పుడున్న తన ఫిట్ నెస్ కి తగినట్టుగానే కథలని సెలెక్ట్ చేసుకుంటున్నాడని తెలుస్తుంది. త్వరలోనే శర్వానంద్ నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.

శర్వానంద్ కొత్త లుక్ చూస్తే ఇప్పుడు లవర్ బోయ్ గా కూడా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. వెరైటీ కథలు.. యాక్షన్ సినిమాల మీద ఫోకస్ పెట్టి లవ్ స్టోరీస్ వదిలేసిన శర్వానంద్ ఈ కొత్త లుక్ తో తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు. శర్వానంద్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది చూడాలి. రిజల్ట్ తో పని లేకుండా తన మనసుకి నచ్చిన కథలను ఓకే చేస్తూ సినిమాలు చేస్తున్న శర్వానంద్ నెక్స్ట్ సినిమా విషయంలో కూడా యూనిక్ గా ఉండాలని చూస్తున్నారు. మరి శర్వానంద్ ఎలాంటి సినిమాతో సర్ ప్రైజ్ చేస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: