టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న నటుడిగా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకుని హీరోగా నటించిన మూవీ లతో మంచి విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న అడవి శేషు గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అడవి శేషు 'క్షణం' మూవీ తో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గూడచారి , ఎవరు సినిమాలతో అడవి శేషు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్న అడవి శేషు తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మేజర్' సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. మేజర్ సినిమాలో శోభితా ధూళిపాళ , సాయి మంజ్రేకర్ కీలక పాత్రలలో నటించగా,  ప్రకాష్ రాజ్ మరో ముఖ్యమైన పాత్రలో నటించాడు.

సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉండటంతో మేజర్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ జూన్ 3 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న మేజర్ సినిమా జూలై 3 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను ఎవరైనా థియేటర్ లలో చూద్దాము అని మిస్ అయిన వారు ఉంటే... నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో  జూలై 3వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: