ఇదంతా ఇలా ఉండగా త్వరలోనే ఈ అందాల ముద్దుగుమ్మ తన వైవాహిక బంధం లోకి అడుగుపెట్టనుంది కొన్ని రోజుల క్రితం వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ ఆలీతో నిశ్చితార్థం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది . ఇక వీరికి సంబంధించి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా గతంలో బాగా ట్రెండ్ గా నిలిచాయి. కానీ షాహిద్ పూర్ణాల వివాహం ఈ ఏడాది జరగబోతోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయాన్ని తాజాగా ప్రసారమైన ఒక టీవీ షోలో ఆమె తెలియజేసినట్లు సమాచారం.
పూర్ణ మ్యారేజ్ డేట్ తో పాటు తమ రిలేషన్షిప్ కు సంబంధించిన పలు విషయాలను కూడా తెలియజేసింది. ఇక పూర్ణది పెద్దలు కుదిరిచిన వివాహం అని పెళ్లయ్యాక తమ ఇద్దరు దుబాయిలో స్థిరపడతామని తెలియజేసింది కాగా యూఏఈ వేదికగా ఉన్న జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి తన కాబోయే భర్త ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారని తెలియజేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నది. అయితే ఆమె మాత్రం తనకు తన భర్తకు అంగీకారమైతేనే నటిస్తానని లేదంటే లేదని తేల్చి చెప్పింది.