నాగార్జున సమ వయసులో ఉన్న సీనియర్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ లు ఇప్పటికే 100 సినిమాల మార్క్ ను ఎప్పుడో దాటిపోయారు. అయితే నాగ్ మాత్రం ఇంకా 100 సినిమాల హీరోగా ఇంకా మారలేకపోయాడు. వాస్తవానికి నాగార్జున హీరోగా నటించిన సినిమాల సంఖ్య 90 దాటకపోయినా అతడు అతిధి పాత్రలో నటించిన సినిమాల సంఖ్యతో కలుపుకుంటే ఇప్పుడు అతడు లేటెస్ట్ గా నటిస్తున్న ‘ఘోస్ట్’ మూవీ అతడి కెరియర్ లో 99వ సినిమాగా మారబోతోంది.
నాగ్ కు సూపర్ హిట్ ఇచ్చిన ‘శివ’ విడుదలైన అక్టోబర్ 5న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల తరువాత నాగార్జున తాను నటించబోయే 100వ సినిమా పై దృష్టి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం నాగ్ నటించబోయే 100వ చిత్రం ‘మనం’ సినిమా రీతిలో అక్కినేని కుటుంబ చిత్రంగా ఉంటుందని టాక్.
ఈ మూవీలో నాగార్జున చైతన్యా అక్కినేని అఖిల్ తో పాటు అమల సుమంత్ సుశాంత్ లు కూడ నటిస్తారని లీకులు వస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి సరిపోయే కథ కోసం నాగ్ ప్రస్తుతం అనేకమంది యంగ్ రచయితలు దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాగార్జున 60 సంవత్సరాలు నిండిన వ్యక్తి పాత్రలో కనిపిస్తాడని కూడ లీకులు వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి