అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందిన థాంక్యూ సినిమా ఈనెల 22వ తేదీన విడుదల కావడానికి సిద్ధమయ్యింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఆ విధంగా ఈ సినిమా అలా విడుదల తేదీని ఫిక్స్ చేసుకుందో లేదో నాగచైతన్య అప్పుడే తన తదుపరి సినిమాను మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. వెంకట ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్న నాగచైతన్య ఆ సినిమాను ఇంకా మొదలు పెట్టక ముందే మరొక సినిమాని కూడా ఓకే చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళనాడు లో వెరైటీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వెంకట్ ప్రభు తెలుగులో తొలిసారిగా అక్కినేని నాగచైతన్యతో కలిసి సినిమా చేయడం విశేషం. ఆ విధంగా ఈ చిత్రాన్ని చేస్తున్న సమయంలోనే చైతన్య సర్కారు వారి పాట సినిమా దర్శకుడైన పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నాగచైతన్య ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నాడని అంటున్నారు. 

వాస్తవానికి గీత గోవిందం సినిమా విడుదల అయిన తర్వాతే నాగచైతన్యతో పరుశురామ్ సినిమా చేయవలసి ఉంది కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో దగ్గర నుంచి పిలుపు రావడంతో ఈ సినిమాను పక్కనపెట్టి ఆయనతో సినిమా చేయడానికి వెళ్లిపోయాడు. ఆ సినిమా విడుదలై మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో మళ్లీ నాగచైతన్యతో కలిసి ఈ సినిమాను చేస్తున్నాడు. అప్పట్లో నాగేశ్వరరావు అలాగే నాగార్జునలు ఇలా ద్విపాత్రాభినయం లో ప్రేక్షకులను ఎంతగానో ఆలరించారు. మళ్లీ అన్ని రోజుల తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగచైతన్య ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. మరి తొలిసారి అయన ఈ ద్విపాత్రాభినయం లో నటిస్తూ ఉండగా ఈ సినిమా ద్వారా చైతు ఏ స్థాయి లో ఆకట్టుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: