దివంగత నటి శ్రీదేవి సాధించిన పేరు ప్రఖ్యాతలు మనందరికి  ఎప్పటికీ గుర్తుండిపోతాయి.అయితే  దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన ఆమెను అక్కడ కూడా సక్సెస్‌ వరించింది.ఇదిలావుంటే తాజాగా ఆమె వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో మంచి కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.ఇకపోతే  నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటనకు పదును పెడుతున్నారు.ఇక  తమిళం, మలయాళం భాషల్లో హిట్‌ అయిన చిత్రాలను హిందీ రీమేక్‌లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.ఇదిలావుంటే అలా ఆమె మలయాళంలో మంచి విజయం సాధించిన హెలెన్‌ హిందీ రీమేక్‌లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు.

ఇకపోతే తాజాగా తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన కోలమావు కోకిల చిత్రం హిందీ రీమేక్‌లో జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు.ఇక ఈ చిత్రంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న కోరిక చాలాకాలంగా ఉందని చెప్పారు. అయితే ముఖ్యంగా మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్‌ పుత్రన్‌ చిత్రాలంటే చాలా ఇష్టం అన్నారు.ఇక  అలాగే తమిళంలో వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఉందన్నారు.ఈ బ్యూటీని దక్షిణాది చిత్రంలో నటింపజేయాలన్న ప్రయత్నాలు చాలాకాలంగానే జరుగుతున్నాయన్నది వాస్తవం.పోతే  ఆ మధ్య తెలుగులో విజయ్‌ దేవరకొండకు జంటగా నటించడానికి సిద్ధమైందనే ప్రచారం కూడా జరిగింది.

అయితే ఇక దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.అంతేకాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో కూడా జాన్వికపూర్ హీరోయిన్గా వెండితెరకు తెరంగేట్రం చేస్తుందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు దీనిపై ఇంకా పూర్తి స్పష్టత అయితే రావడం లేదు. మరి టాలీవుడ్ కి జాన్వి కపూర్ ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తుందనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో జాన్వి కపూర్ గుడ్ లక్ జెర్రీ అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని కనబరచగా.. ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా విడుదల కానుంది.!!

మరింత సమాచారం తెలుసుకోండి: