టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వర్మ ప్రతి విషయాన్ని కూడా తనదైన కోణంలో స్పందిస్తూ తరచూ వివాదాలకు తెర లేపుతూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదానికి తెర లేపారు వర్మ. రీసెంట్ గా రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో వర్మ చేసిన ట్వీట్ కాస్త బాగా వైరల్ గా మారింది. ముఖ్యంగా వర్మ చేసిన ట్వీట్ పై బిజెపి వర్గాలు కూడా ఒక రేంజ్ లో ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం. అంతే కాదు వర్మ పై  కేసులు నమోదు కూడా అయ్యాయి. ఇక వివాదం మరింత ముదరకముందే తాను ద్రౌపది మూర్ము విషయంలో చేసిన ట్వీట్ ఉద్దేశం అది కాదు అంటూ వివరణ కూడా ఇచ్చాడు.

ఈసారి కామ్ గా ఉండడం ఎందుకని అనుకున్నాడో ఏమో కానీ మరో పార్టీని గెలికే ప్రయత్నం చేశాడు వర్మ. ఇక ఈసారి ఏకంగా మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీని ఉద్దేశించి ట్వీట్ చేయడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వర్మ ఈసారి ఇందిరాగాంధీని ఉద్దేశించి డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేయడం గమనార్హం. ఇకపోతే తాజాగా ఇందిరాగాంధీ బయోపిక్ ఎమర్జెన్సీ సినిమాలో ప్రధాన పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల కాగా ఈ క్రమంలోనే 1984లో ఇందిరా గాంధీ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో లింకును కూడా వర్మ షేర్ చేసి ఇందిరాగాంధీ  అచ్చం కంగనా లా నటించింది.. కావాలంటే ఇంటర్వ్యూ చూడండి అంటూ కామెంట్ కూడా చేశాడు.ఇక వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతూ ఉండగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఎలా స్పందిస్తాయో తెలియాల్సి ఉంది. ఒకవేళ వాళ్ళు సీరియస్ గా తీసుకుంటే వర్మపై మరొక కేసు నమోదయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అని నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: