అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్యూ సినిమా ప్రేక్షకులను భారీ స్థాయిలో నిరాశపరిచింది. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విభిన్నమైన కథాంశం తో ముందుకు వచ్చినా కూడా అది ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. ఈ నేపథ్యంలోనే చైతు కి మరో ఫ్లాప్ వచ్చినట్లు అయ్యింది.  కారణం ఏదైనా కూడా ఈ సినిమాలో ఫ్లాప్ యొక్క క్రెడిట్ నాగచైతన్య కే దక్కింది అని చెప్పాలి. మొదటి నుంచి ఈ సినిమాపై ఎలాంటి పాజిటివ్ వైబ్స్ లేకపోవడం ఈ సినిమా బాగుండదు అనే నమ్మకాన్ని అందరిలో ఏర్పరిచింది. ఫైనల్ గా అందరిని ఈ సినిమా నిరాశపరిచి భారీ ఫ్లాప్ గా నిలిచింది. 

విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏ ఒక్క  కొత్త పాయింట్ కూడా లేకపోవడం నిజంగా ఈ సినిమా ఇంతటి దారుణంగా ఉందని చెప్పడానికి ముఖ్య కారణం. తాజాగా నాగచైతన్య ఈ సినిమాను పక్కనపెట్టి తన తదుపరి సినిమాల షూటింగ్ ను చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ విధంగా వెంకట ప్రభు దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ఆయన సంసిద్ధమవుతున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా వెరైటీ చిత్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇకపోతే పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్యసినిమా చేయవలసి ఉంది కానీ ప్రస్తుతం ప్రయోగాలు చేయడం ఇష్టం లేక నాగ చైతన్య ఆ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక అగ్ర దర్శకుడు కి ఇలాంటి ఒక చేదు అనుభవం ఏర్పడడం నిజంగా అవమానకరం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పరశురామ్ ఈ చిత్రం తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తాడో చూడాలి. సర్కార్ వారి పాట సక్సెస్ అయిన నేపత్యంలో ఈ దర్శకుడిని రిజెక్ట్ చేయడం నిజంగా చైతు పొరపాటు చేశాడనే చెప్పాలి. ఆయనతో మాస్ సినిమా చేసి హిట్ కొట్టి మాస్ ఫాలోయింది పెంచుకుంటే ఆయనకు ప్లస్ అయ్యి ఉండేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: