తెలుగు ,కన్నడ భాషలలోనే కాకుండా ఇతర భాషలలో సైతం స్టార్ హీరోయిన్గా కొనసాగిస్తున్నది హీరోయిన్ రష్మిక. ఇక బాలీవుడ్ లో తమిళంలో నిలదొక్కుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది ఈ ముద్దుగుమ్మ. పుష్ప చిత్రంలో ఈమె పోషించిన శ్రీవల్లి పాత్ర ఈమెకు పాన్ ఇండియా స్టార్ రేంజ్ లో గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా సీక్వెల్ తో కూడా తన హావాని కొనసాగిస్తూ ఉన్నది రష్మిక. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రష్మిక మరొకరు హీరోయిన్ గా చేసిన సినిమాలో కూడా ముఖ్యమైన పాత్రలో పోషించడం అంటే అది చాలా విశేషమని చెప్పవచ్చు. ఇలాంటి ప్రయత్నాలు ఏ హీరోయిన్లు ఎక్కువగా చేయారని చెప్పవచ్చు.


సాధారణంగా సినిమాలలో కొత్తదనం కోసమో.. మొహమాటం కోసము కొంతమంది ఇలాంటి పాత్రలను ఒకే చెప్పారు. అలాకాకుండా రష్మిక సీతారామం  సినిమాలో  ఒక కీలకమైన పాత్రలో నటించింది దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన ఈ సినిమాలో రష్మిక అఫ్రీన్ అనే పాత్రలో కనిపిస్తుంది. 1960లో రామ్ తో ప్రేమలో పడిన సీత మహాలక్ష్మికి ఆయన రాసిన ఉత్తరాన్ని 1985లో అందజేయడానికి వెళ్లేటువంటి పాత్రలో రష్మిక నటిస్తుంది. హీరోయిన్ కాకుండా మరొకరు  పాత్ర అంటే  ఏ హీరోయిన్ కూడా ఇలాంటి కథలకు ఒప్పుకోదని చెప్పవచ్చు..కానీ రష్మిక కెరియర్ బాగా స్పీడులో ఉండడంతో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పాత్రలు చేస్తోంది అంటే అది చాలా సాహసమే అని చెప్పవచ్చు.


పైగా అది ముస్లిం యువతీ పాత్ర అందులోను పాకిస్తాన్ కి చెందిన పాత్ర. ఆ పాత్ర గురించి చెప్పినప్పుడు రష్మిక కాస్త ఆలోచనలు పడిందట.. ఒక రోజంతా ఆలోచించి ఆ తర్వాత నటిస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు డైరెక్టర్ హాను రాఘవపూడి తెలిపారు. ఈ చిత్రం మొదలైన కొద్దిసేపటికి రష్మిక పాత్ర ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. హీరో హీరోయిన్లను దగ్గర చేర్చే బాధ్యతను తన భుజాల మీద వేసుకొని ఈమె తన పాత్రను కొనసాగిస్తూ ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు రష్మీక పాత్ర కొనసాగితోనే ఉంటుంది. ఈ సినిమాలో ఈమె పాత్ర కీలకం కావడంతో రష్మిక ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడానికి ముఖ్య కారణమని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: