జూన్ 3 వ తేదీన విడుదల అయిన మేజర్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి . కాకపోతే ఆ సినిమాలు ఏవి కూడా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. దానితో గడిచిన రెండు నెలలు కూడా తెలుగు బాక్సాఫీస్ దగ్గర సరైన విజయం పడలేదు. ఇలా సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి.

ఇలా గత రెండు నెలలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమాలు అన్నీ దాదాపుగా బోల్తా కొట్టాయి. ఇది ఇలా ఉంటే ఆగస్ట్ 5 వ తేదీన సీతా రామం మరియు బింబిసార మూవీ లు విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.  ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగానే ఈ మూవీ లు విడుదలైన మొదటి రోజు మొదటి షో కే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. దానితో ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు కూడా దక్కుతున్నాయి.

ఇలా బాక్సాఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ  రెండు సినిమాల  గురించి మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్పందించాడు. ప్రేక్షకులు థియేటర్ లకి రావడం లేదు అ,ని బాధ పడుతున్న ఇండస్ట్రీ కి ఊరట, ఉత్సాహాన్ని ఇస్తూ కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ వస్తారని చేస్తున్న ప్రూవ్ చేసిన సీతా రామం మరియు బింబిసార మూవీ లకి చిత్ర నటీనటులు, నిర్మాతలకు సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. చిరంజీవి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: