గతంలో ఎంతో మంది రచయితలు దర్శకులుగా మారడం జరిగింది డాన్స్ మాస్టర్లు కూడా దర్శకులుగా మారుతూ ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఎడిటర్లు కూడా దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇక అలా ఎడిటింగ్ వైపు నుంచి వచ్చిన రాజశేఖర్ రెడ్డి తాజాగా మెగా ఫోన్ పట్టుకున్నారు. ఇక సుధాకర్ రెడ్డి, నికిత్ రెడ్డి నిర్మించిన మాచర్ల నియోజకవర్గం సినిమాతో కొత్త డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఈనెల 12న విడుదల కాబోతోంది. తినే పద్యంలోని ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజశేఖర్ రెడ్డి మాట్లాడడం జరిగింది.


ఈ స్టేజికి తను రావడానికి 15 సంవత్సరాలు సమయం పట్టింది అని అందరిలాగే నేను కూడా చాలా కష్టాలు పడుతూనే ఇండస్ట్రీలోకి వచ్చాను నేను ఇంటర్ చదువుతున్న సమయంలో తన తండ్రి చనిపోయారట అప్పటినుంచి మిగతా కుటుంబ సభ్యులంతా తనని సపోర్ట్ చేస్తూ వచ్చారని తెలిపారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మరికొందరు తనని సపోర్ట్ చేశారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారని తెలిపారు. ఇండస్ట్రీలో తనను ఒక టెక్నీషియన్ గా నిలబెట్టిన పూరి జగన్నాథ్ నా దేవుడు అందుకే అతనికి థాంక్స్ చెబుతున్నానని తెలిపాడు.. ఇక ఆ తర్వాత ఎడిటర్ నుంచి డైరెక్టర్ గా మార్చిన నితిన్ గారికి పెద్ద ధన్యవాదాలు అని కూడా తెలిపారు.


నితిన్ లై సినిమా చేస్తున్నప్పుడు మంచి కథ రెడీ చేసుకుంటే డైరెక్టర్గా అవకాశం ఇస్తానని తనతో అన్నారని ఆ తర్వాత నేను ఆయనకి కథ చెప్పడం తను నాకు అవకాశం ఇవ్వడం ఇలా అన్ని ఒకేసారి జరిగిపోయాయని తెలిపారు. ఎవరైనా సరే మాట నిలబెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కానీ నితిన్ ఆ మాటను నిలబెట్టుకున్నారు అని తెలిపారు. లాస్ట్ వీక్ విడుదలైన రెండు సినిమాలు ఎలాగైతే సక్సెస్ అయ్యాయో అలాగే నెక్స్ట్ వీక్ వచ్చేసి మా సినిమా కూడా మంచి విజయాన్ని చేకూరుతుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: