నిఖిల్ హీరోగా రూపొందిన కార్తికేయ 2 చిత్రం ఈ శనివారం విడుదల అయ్యేందుకు సిద్ధమవుతుంది. గతంలో పలు విడుదల తేదీలను పరిశీలించిన తర్వాత చివరికి ఈ ఆగస్టు 13 వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమయ్యింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి చందు మొండేటి దర్శకత్వం అందిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా విజయం సాధించడం తప్పకుండా అందరికి ఎంతో ముఖ్యమని చెప్పాలి. హీరో నిఖిల్ కి, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కి దర్శకుడు చందు మొండేటి కి కూడా ఈ విజయం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పాలి.

కారణం ఏమిటంటే వీరు ముగ్గురు కూడా తమ గత చిత్రాలతో ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయారు. నిఖిల్ హీరో గా నిలదొక్కుకోవాలంటే తప్పకుండా ఈ సినిమా తో హిట్ అందుకోవాలి. అనుపమ పరమేశ్వరన్ కూడా చిన్న హీరోల చిత్రాలలో నటించి కొంత విమర్శల పాలయ్యింది. అందులో మోతాదుకు మించి రొమాన్స్ చేసినా కూడా ఆమెకు అది ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. దాంతో ఇప్పుడు చేస్తున్న ఈ మిస్టీరియస్ సినిమా తో హిట్ అందుకోవాలి అని చూస్తుంది. ఇదే హీరోతో ఆమె మరో సినిమా లో కూడా నటించడం విశేషం. మరి ఆమెకు ఈ హీరో కలిసి వస్తాడా అనేది చూడాలి.

చందు మొండేటి గత సినిమా సవ్య సాచి దారుణంగా ప్లాప్ అయ్యింది. అందుకే ఈ సారి మళ్ళీ తన కార్తికేయ సినిమా ఫార్ములానే నమ్ముకున్నాడు. నిఖిల్ తో ఆల్రెడీ సినిమా చేసిన అనుభవం ఉండడంతో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అని చెప్పడానికి కారణం. మరి ఈ ముగ్గురుకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా యొక్క అప్డేట్ లు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. సినిమా పై మంచి అంచనాలు కూడా పెంచింది. మరి ఆగస్టు 13 వ తేదీ వీరికి కలిసి వస్తుందా అనేది చూడాలి. దీనికి అభిషేక్ నామా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారం బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: