టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య తాజాగా థాంక్యూ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించగా , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. మంచి అంచనాల నడుమ జూలై 22 వ తేదీన విడుదల అయిన థాంక్యూ మూవీ ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది.

దానితో థాంక్యూ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ కలెక్షన్ లను అందుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తాజాగా అమీర్ ఖాన్ , కరీనా కపూర్ హీరో హీరోయిన్ లుగా నటించిన హిందీ మూవీ లాల్ సింగ్ చడ్డా లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11 వ తేదీన విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య మరి కొన్ని రోజుల్లోనే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.

మూవీ లో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించబోతోంది. ఇది ఇలా ఉంటె ఈ సినిమా తర్వాత నాగ చైతన్య, పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. కాకపోతే నాగ చైతన్య కొంత కాలం పాటు పరశురామ్ మూవీ ని హోల్డ్ లో పెట్టి డీజే టిల్లు మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి నాగ చైతన్య ముందుగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటిస్తున్నాడా ...  లేక విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో నటిస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: