ఈ సంవత్సరం పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచిన మూవీలలో కే జి ఎఫ్ చాప్టర్ టు మూవీ ఒకటి. ఈ మూవీ లో యష్ హీరోగా నటించగా , శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా , రవి బుస్రుర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మూవీ లో సంజయ్ దత్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో మొదటి నుండే కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇలా థియేటర్ లలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది.  ఈ సినిమా తెలుగు హక్కులను జీ సంస్థ వారు దక్కించుకున్నారు. ఈ మూవీ తెలుగు టెలికాస్ట్ డేట్ ను తాజాగా జీ సంస్థ విడుదల చేసింది. ఈ మూవీ ని ఈ ఆగస్ట్ 21 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రసారం చేయనున్నట్టుగా జీ తెలుగు నిర్వహణ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: