ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినీ పరిశ్రమలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు నటుడు విజయ్ దేవరకొండ . ఇలా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.


ముఖ్యంగా ఈయనకు యువతలో విపరీతమై న క్రేజ్ ఉంది.విజయ్ దేవరకొండ అంటే కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈయనకు అభిమానులుగా మారిపోయారు.


ముఖ్యంగా ఎంతోమంది హీరోయిన్లు సైతం విజయ్ దేవరకొండ తమ క్రష్ అని, తనతో డేట్ చేయాలని ఉందంటూ ఓపెన్ అయ్యారు. ఇకపోతే మరికొంతమంది ఈయనతో ఒక్క సినిమాలో అయినా నటించే అవకాశం వస్తే చాలు అంటూ ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.ఇలా ఈ రౌడీ హీరో సరసన నటించడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండగా ఒక హీరోయిన్ మాత్రం తనకు అవకాశం వచ్చిన సున్నితంగా ఈ సినిమా అవకాశాన్ని రిజెక్ట్ చేసింది.


  ఇలా తన సినిమాలో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేయడమే కాకుండా, భవిష్యత్తులో విజయ్ దేవరకొండ తో కలిసి సినిమాలలో నటించినని తెగేసి చెప్పారు. ఇలా విజయ్ దేవరకొండతో నటించినని చెప్పేసిన ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. సాయి పల్లవి విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఇందులో ముద్దు సన్నివేశాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేశారు.ఇక ఈ సినిమాను రిజెక్ట్ చేయడమే కాకుండా ఆయన సినిమాల ఎంపిక విషయం చాలా భిన్నంగా ఉంటుందని అందుకే భవిష్యత్తులో కూడా తనతో సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా లేనని చెప్పేశారు.మరి చూడాలి భవిష్యత్తు లో సాయి పల్లవి విజయ్ తో నటిస్తుందో లేదో మరి. ఫాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ కావాలనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: