సీనియర్ నటులు మురళీమోహన్ మా అధ్యక్షుడుగా ఉన్నప్పటి నుంచి మాలో ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉన్నది చిరంజీవి తొలి అధ్యక్షుడిగా మొదలైన మా అసోసియేషన్ గత రెండు సంవత్సరాలకు ఒకసారి కార్యవర్గ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఎలక్షన్లలోను మా బిల్డింగ్ ప్రధాన అంశంగా మారుతూ వస్తోంది ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తూ ఉండడంతో సినీ ఇండస్ట్రీలో ఈ ఎన్నికలు చాలా హట్ టాపిక్ గా మారాయి. అధికార పార్టీలు కూడా కొన్ని సందర్భాలలో ఈ విషయాలపై జోక్యం చేసుకొని అధ్యక్షత పదవిని డిసైడ్ చేయడం జరుగుతూ వస్తున్నాయి.


రాజేంద్రప్రసాద్,జయసుధ, శివాజీ రాజా, నరేష్ వంటి వారు అధ్యక్షత పదవి కోసం చాలా పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలలో పోటీపడిన రాజకీయ నేతల తరహాలో ఒకరి పైన ఒకరు మాటల యుద్ధం చేసుకొని నానా రచ్చ చేస్తూ ఉంటారు. రాజేంద్రప్రసాధన జయసుధ జోకర్ అనడంతో అప్పట్లో ఈ విషయం తీవ్ర చర్చకు దారితీసింది. ఇక నరేష్ శివాజీ ధర్ములోను కూడా ఇదే తరహాలో రచ్చ నడిచిందని చెప్పవచ్చు. రెండేళ్ల పదవి కాలం కోసం ఎందుకింత రచ్చ అంటే సగటు ప్రేక్షకులు కూడా వీరి విషయాలపై చెందారు.


అయితే గడిచిన ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానల్ చాలా పోటీపడి మంచు విష్ణు వర్గం విజయం సాధించింది. అయితే మా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు ఇప్పటివరకు ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన మా బిల్డింగ్ గురించి ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అయితే ఇటీవల జయసుధ మీడియా ముందు మంచు విష్ణు పై పలు విషయాలను తెలియజేసింది. పదవి స్వీకరించి నెలలు కడుతున్న మా బిల్డింగ్ విషయం గురించి మాత్రం ఎక్కడ పేరు ఎత్తడం లేదని ఆమె పరోక్షంగా తెలియజేసింది దీనిపై మంచు విష్ణు స్పందించలేదు. తాజాగా మంచు విష్ణు ఒక ట్విట్ చేశాడు ప్రస్తుతం మాటీవీలో వైరల్ గా మారుతుంది. ఈ ట్రిప్ట్ మీద పలువురు నెటిజన్స్ మా బిల్డింగ్ లేనట్టేనా అంటూ సెటైర్  వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: