మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో,  అందంతో ఎంతోమంది హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి 17 సంవత్సరాలు పూర్తయింది. ఇక కెరియర్ ఆరంభంలో కొన్ని ఒడుదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ హ్యాపీడేస్ సినిమాతో తన కెరీర్ ను  ఒక్కసారిగా మార్చుకుంది అని చెప్పవచ్చు.  వరుసగా స్టార్ హీరోల సినిమాలు కూడా చేసింది.  టాలీవుడ్ లోనే దాదాపు అందరి హీరోలతో కలిసి నటించింది. అయితే ఇప్పటికీ కూడా టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది అంతేకాదు సత్యదేవ్ హీరోగా వస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమాలో కూడా ఈమె నటిస్తోంది.

అంతటితో ఆగకుండా మరొకవైపు తమిళంలో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కూడా హీరోయిన్గా ఎంపికైంది తమన్నా. ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో నటించాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల ఆమె తప్పుకోవడంతో ఆ అదృష్టం తమన్నాకు వరించింది. ఇక అంతే కాదు పలు వెబ్ సిరీస్ లు,  ఐటమ్ సాంగ్స్ , మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.. తొలినాళ్లలో అడుగుపెట్టిన సమయంలో కొందరు హీరోయిన్స్ కూడా అడుగుపెట్టారు. వారిలో ఇప్పటికే చాలామంది తెర మరుగయ్యారు. కొందరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అక్కగా, అమ్మగా నటిస్తున్నారు.

కానీ మిల్క్ బ్యూటీ తమన్న మాత్రం జోరు తగ్గించకుండా.. స్పీడ్ తగ్గకుండా తగ్గేదేలే అన్నట్లుగా వరుస సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతోంది. ఈమె చేసిన అన్ని సినిమాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం.. ఇక ఈమె నటించిన అన్ని సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరో ఐదు సంవత్సరాల వరకు తమన్నా జోరు కంటిన్యూ అవుతుందని సినీ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: