
ఈ వివాహం అంగ రంగ వైభవంగా జరగడంతో తమిళ మీడియాలో పలు కథనాలు బాగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వివాహం ఎలా జరిగిందో అనే విషయాన్ని ఎక్కువగా ప్రేక్షకులు పట్టించుకోలేదు కానీ తమ పెళ్లి ఫోటోలు షేర్ చేసిన మహాలక్ష్మి ఇంస్టాగ్రామ్ లో నిన్ను వివాహం చేసుకోవడం నువ్వు నా జీవితంలోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఒక పోస్ట్ ని చేసింది. నిన్ను భర్తగా పొందడం చాలా సంతోషంగా ఉంది లవ్ యు అమ్ము అంటూ రాసుకుంది. ఇక అంతే కాకుండా నిర్మాత రవిచంద్ర కూడా ఈ పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకున్నారు.
అయితే ఈ జంటకు ఇది మొదటి వివాహం కాదు రెండో వివాహం. అయితే వీరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం బాగానే గుర్తింపు సంపాదించుకున్నారు. ఇదివరకే వీరిద్దరికీ వివాహమైన కొన్ని మనస్పర్ధలు కారణాల చేత వారి జీవిత భాగస్వామిలతో విడిపోయి ఒంటరిగా గడుపుతున్నారు. ఇలాంటి సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇలా ఇద్దరు ఒంటరిగా ఉండడంతో మీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొని చెన్నైలో ఈరోజున అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి